Hyderabad, అక్టోబర్ 2 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌ నాలుగో వారానికి వచ్చేసింది. నాలుగో వారం బిగ్ బాస్ 9 తెలుగు కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ జరుగుతోంది. కెప్టెన్సీ కంటెండర్స్‌గా గెలిచేందుకు పవర్ కార్డ్స్ సంపాదించే గేమ్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్.

ఈ గేమ్‌లో భాగంగా హంగ్రీ హిప్పో (నీటి ఏనుగు) టాస్క్ నడుస్తోంది. దీంట్లో నీటి ఏనుగు ఉన్న బొమ్మ నోటీలో పైనుంచి పడిన బాల్స్‌ను తీసుకొచ్చి వేయాలి. బ్లూ, రెడ్, గ్రీన్ మూడు టీమ్స్‌గా కంటెస్టెంట్స్ ఆడుతున్నారు. అయితే, ఈ గేమ్ ఆడే క్రమంలో తన నడుము ఎవరో గిల్లారని, అది ఎవరో తెలిసా అని సంచాలక్‌గా ఉన్న భరణిని ఇమ్మాన్యుయెల్ అడిగాడు.

"సంచాలక్ గేమ్‌లో ఎవరో నా నడుము గిల్లారు. అది ఎవరో మీరు చెప్పాలి. నా నడుము అంతా బాగున్నంత మాత్రానా గేమ్ అడ్డుపెట్టుకుని.. ఇది పర్సనల్ అబ్యూస్‌లా నేను ఫీల్ అవుతా" అని ఇమ్మాన్య...