భారతదేశం, డిసెంబర్ 23 -- హీరోయిన్ డ్రెస్ లపై సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చీరలోనే అందంగా ఉంటారని, సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకోవద్దని శివాజీ కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. శివాజీ కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కొంతమంది ఖండిస్తే, మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా అనసూయ పోస్ట్ శివాజీ కామెంట్లకు కౌంటర్ గా ఉందని అంటున్నారు. సింగర్ చిన్మయి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఒకప్పటి హాట్ యాంకర్, ఇప్పుడు నటిగా బిజీ అయిన అనసూయ యాక్టివ్ గా ఉంటోంది. ఏ విషయం అయినా తన అభిప్రాయాలు చెబుతోంది. ట్రోల్స్ ఎన్ని వచ్చినా తగ్గేదేలేదన్నట్లు తన సొంత దారిలో సాగిపోతుంది. ఆమె మంగళవారం (డిసెంబర్ 23) సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ''ఇది నా శరీరం. నీది కాదు (ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్)'' అని పోస్టు చేసింది....