Hyderabad, ఆగస్టు 15 -- సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇచ్చే ప్రతిష్టాత్మక వార్డులలో సైమా ఒకటి. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రతి ఏడాది ఘనంగా జరుగుతుంటుంది. అలాగే, ఈ సంవత్సరం కూడా సైమా అవార్డ్స్ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం దుబాయ్ వేదికగా మారింది.

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో సైమా 2025 అవార్డ్స్ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తాజాగా సైమా అవార్డ్స్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల నేషనల్ అవార్డ్స్ సాధించిన తెలుగువారిని సైమా ఘనంగా సత్కరించింది. ఈ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. భగవంత్ కేసరి నా కెరీర్‌లో చాలా స్పెషల్ ఫిలిం. సినిమాకి జాతి స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేషనల్ అవార్డు కమిటీకి జ్యూర...