భారతదేశం, ఏప్రిల్ 25 -- పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించింది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పహల్గాంలో 26 మందిని టెర్రరిస్ట్ లు హత్య చేసిన కొద్ది రోజుల తర్వాత ఆమె ఈ ప్రకటన చేసింది. గురువారం (ఏప్రిల్ 24) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో, ఆమె ఈ దాడిని 'దుర్మార్గం' అని పేర్కొంది. ఇతర పాకిస్థాన్ సెలబ్రిటీలు కూడా స్పందించారు.

పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ రియాక్టయింది. ఇది దుర్మార్గమని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్టు చేసింది. "ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా హింస దుర్మార్గం. పహల్గాం దాడిలో ప్రభావితమైన వారందరికీ నా సంతాపం'' అని పేర్కొన్న ఆమె.. గుండె పగలిన ఎమోజీని యాడ్ చేసింది.

మహీరా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

పహల్గామ్ ఉగ్రదాడిని ఇతర పాకిస్థాన్ సెలబ్రిటీలు కూడా ఖండించారు. ఎంతో బాధగా ఉందంటూ పోస్టులు పెట్టార...