Hyderabad, మే 8 -- కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం సింగిల్. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో కల్యాణ్ ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.

శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా చేయగా.. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించాడు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీ మే 9న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ సినీ విశేషాలను పంచుకున్నాడు.

-అందరికీ నమస్కారం. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. మే 9న సింగిల్ సినిమా రిలీజ్ కాబోతుంది. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. కొత్త కథ, స్క్రీన్ ప్లే ఉంటుంది. బ్యూటిఫుల్...