Hyderabad, మే 16 -- ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ అనగనగా ఇప్పుడు ఓటీటీలో దూసుకెళ్తోంది. మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ టీచర్ అంటే ఇలా ఉండాలి అనేలా ఈ సినిమాను రూపొందించారు. గురువారం (మే 15) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సుమంత్ లీడ్ రోల్లో నటించిన అనగనగా మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే 50 మిలియన్ల అంటే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. గురువారం (మే 15) ఓటీటీలోకి వచ్చే ముందు బుధవారం సాయంత్రం ఈ సినిమా ప్రీమియర్ షోలు వేశారు. పలువురు సెలబ్రిటీలతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ చూశారు.

అప్పటి నుంచే పాజిటివ్ రివ్యూలు రావడం మొదలయ్యాయి. దీంతో ఓటీటీలోకి రాగానే ఫ్యాన్స్ ఎగబడి చూసేస్తున్నారు. సుమంత్ చెప్పే పాఠాలు వాళ్లను బాగానే ఆకర్షిస్తున్నట్లు తాజాగా అనగనగా మూవీ స్ట్రీమింగ్...