భారతదేశం, ఆగస్టు 7 -- జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన స్టెప్పులు వేస్తే ఫ్యాన్స్ ఊగిపోతారు. ఆయన గ్రేస్ వేరే లెవల్. ఇక బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా డ్యాన్స్ లో ఏం తక్కువ కాదు. ఆయన స్టైల్ ఆయనదే. ఈ ఇద్దరు కలిసి స్టెప్పులేస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ కావాల్సిందే. వార్ 2 (War 2) మూవీతో అది సాధ్యం కానుంది. ఈ సినిమా నుంచి జనాబ్ ఎ అలీ సాంగ్ లో తారక్, హృతిక్ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ టీజర్ రిలీజైంది. కానీ మేకర్స్ మాత్రం ట్విస్ట్ ఇచ్చారు.

వార్ 2 సినిమాలోని జనాబ్-ఎ-అలీ అనే పాట ఎట్టకేలకు టీజర్ రూపంలోనే విడుదలైంది. తెలుగులో 'సలామ్ అనాలి' అంటూ సాగుతోంది. భారతీయ సినిమా మోస్ట్ డైనమిక్ డ్యాన్సర్లు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ స్టెప్స్ తో ఈ సాంగ్ అదిరిపోయింది. హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ డాన్స్, అదిరిపోయే కొరియోగ్రఫీ, ఫ...