Hyderabad, ఏప్రిల్ 28 -- ఓటీటీ వచ్చిన తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ నే నమ్ముకొని ప్రేక్షకులను అలరించే మూవీస్ వస్తున్నాయి. అలాంటిదే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ (Crazxy) మూవీ కూడా. ఈ సినిమా మొత్తం దాదాపు ఒకే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ.. ఒకే కారులో సాగిపోయే షూటింగ్ అంటే నమ్మగలరా?

సినిమాలో 90 శాతం వరకు కనిపించేది ఒకే ఒక్క పాత్ర. ఓ కారులోనే సాగిపోయే కథనం.. 93 నిమిషాల్లోనే ముగిసే సినిమా. కానీ ఈ మూవీ క్లైమ్యాక్స్ కు చేరుకునే సమయానికి ప్రేక్షకుడికి కావాల్సిన దాని కంటే ఎక్కువ థ్రిల్లే వస్తుంది. క్రేజీ అనే టైటిల్ కు తగినట్లుగానే ఈ మూవీ కూడా పిచ్చెక్కిస్తుంది. రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.11 కోట్లు వసూలు చేసింది.

ఇదేమంత గొప్ప వసూళ్లు కాకపోవచ్చు. కానీ ఓ మంచి థ్రిల...