భారతదేశం, నవంబర్ 18 -- ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్ వచ్చేసింది. ఓ అభిమాని బయోపిక్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి హీరో అభిమాని తన సినిమా అని చెప్పుకునే విధంగా ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అభిమాని కోసం కదిలి వచ్చే హీరో కథ ఇది.

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ పోతినేని తీసిన మరో మాస్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా. ఓ హీరో, అతని వీరాభిమాని చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ వస్తోంది. ఇందులో సాగర్ అనే అభిమాని పాత్రలో రామ్ కనిపించగా.. ఆంధ్రా కింగ్ సూర్య అనే హీరో పాత్రలో ఉపేంద్ర నటించాడు. ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రతి హీరో అభిమాని ఇది తన స్టోరీ అనిపించేలా మూవీ తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఏంటి సాగర్.. ప్రిం...