భారతదేశం, ఫిబ్రవరి 16 -- బాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా స్టార్ కిడ్స్ హవా నడుస్తోంది. గతేడాది 'ఉయి అమ్మ' అనే సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే, ఈ పాటలో స్టార్ కిడ్ రాషా తడానీ నటించినప్పటికీ ఆమె డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఇతర స్టార్ కిడ్స్ కంటే రాషా చాలా బెటర్ అని తెగ కామెంట్స్ వచ్చాయి.

అలా ఉయి అమ్మ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత సీనియర్ హీరోయిన్, కేజీఎఫ్ 2 నటి రవీనా టాండన్ కూతురు అయిన రాషా తడానీపై కొన్ని రూమర్స్ మొదలయ్యాయి.

తన సొంత ఇమేజ్‌ని పెంచుకోవడానికి ఇతర స్టార్ కిడ్స్‌పై రాషా తడానీ నెగెటివ్ పీఆర్ (Negative PR) చేయిస్తోందని నెట్టింట కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ రూమర్లపై రవీనా టాండన్ తాజాగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఒక పాపులర్ పాడ్‌కాస్ట్ సెషన్‌లో పాల్గొన్న రవీనా...