భారతదేశం, జనవరి 9 -- బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించాడు. శుక్రవారం (జనవరి 9) ఉదయం అతడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఒకవైపు అతడు కీలక పాత్రలో నటించిన ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' (The Raja Saab) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తుండగా.. సంజు బాబా దైవ దర్శనంలో కనిపించడం విశేషం.

కాఠ్మండులో ఒక క్యాసినో ప్రారంభోత్సవం కోసం వెళ్లిన సంజయ్ దత్.. ఈ సందర్భంగా శివయ్యను దర్శించుకున్నాడు. గురువారం (జనవరి 8) సాయంత్రమే నేపాల్ చేరుకున్న సంజయ్ దత్.. శుక్రవారం ఉదయం పశుపతినాథ్ ఆలయానికి వెళ్లాడు. అతన్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎగబడటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంజయ్ దత్ చాలా సాదాసీదాగా కనిపించాడు. తెల్లటి దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్ష మాలలు, భుజాన సంప్రదాయ అంగవస్త్రంతో భక్తి...