భారతదేశం, మే 12 -- ఎలాంటి సినిమా బ్యాక్‍గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యారు. కెరీర్‌ను ఒక ప్లానింగ్, ఒక పద్ధతితో బలపరుచకున్నారు. సినిమాలతో ఇటుక ఇటుక పేర్చి టాలీవుడ్‍లో ఏకంగా తనకంటూ ప్రత్యేక కోట కట్టేసుకున్నారు. చాలా మంది కొత్త టాలెంటెడ్ దర్శకులను వెలుగులోకి తెచ్చారు. మూడు వంద కోట్ల సినిమాతో దాదాపు టైప్-1 హీరోల జాబితాలోకి నేచులర్ స్టార్ అడుగుపెట్టేశారు. ఇటీవలే హిట్ 3తో మరో బ్లాక్‍బస్టర్ కొట్టారు. నవీన్ బాబు నుంచి నేచురల్ స్టార్ నాని వరకు ఎదిగేందుకు ప్రధానమైన కారణాలు ఏవంటే..

నేచురల్ స్టార్ నాని.. తెలుగు ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అయ్యారు. కెరీర్ ఆరంభంలో ఆయన అలాంటి చిత్రాలే చేశారు. 2008లో అష్టాచెమ్మ మూవీతో నాని తెరంగేట్రం చేశారు. ఆ చిత్రమే ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. నానికి గుర్త...