భారతదేశం, మే 9 -- ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోంది. అయితే.. ఈ డబ్బులతో నిర్మాణం పూర్తి కాదని.. చాలామంది వెనకడుగు వేస్తున్నారు. మంజూరు అయినా నిర్మాణం ప్రారంభించలేదు. ఈ సమయంలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కేవలం ఆరుగురు వర్కర్ల సాయంతో.. 15 రోజుల్లో.. 75 చదరపు గజాల్లో.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టారు.

తెలంగాణ హౌసింగ్​ డిపార్ట్​మెంట్​ పర్యవేక్షణలో ఓ ప్రైవేట్ ​కంపెనీ ఇంటి నిర్మాణాన్ని చేసిచూపెట్టింది. షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా, కేవలం అల్యూమీనియం ఫ్రేమ్ వర్క్, కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని నిర్మించింది. ఇప్పటికే నాలుగు మోడల్ హౌస్‌ల నిర్మాణాన్ని పూర్తి చేసిన కంపెనీ.. లబ్ధిదారులతో అగ్రిమెంట్‌కు సన్నాహాలు చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు మోడల్ హౌస్‌ల నిర...