భారతదేశం, జూన్ 16 -- ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఇండియాలోని సామాన్యుడిపై ఆర్థిక పిడుగు పడే అవకాశం ఉంది! ఈ రెండు దేశాల మధ్య అనిశ్చితి.. ప్రపంచ ఇంధన మార్కెట్లపై, ముఖ్యంగా ముడి చమురు ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. మధ్యప్రాచ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో ఒకటి కాబట్టి, ఈ ప్రాంతంలో ఏదైనా సంఘర్షణ జరిగితే, అది చమురు ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. పశ్చిమ ఆసియా ప్రాంతం నుండి సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనల మధ్య, ఈ ఘర్షణ ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేయడం ప్రారంభించింది. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫలితంగా భారత్​లో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు!

వారం రోజుల క్రితం 70 డాలర్లకు దిగువ ఉన్న బ్రెంట్​ క్రూడ్​.. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా తాజాగా 75.42 డాల...