భారతదేశం, జూన్ 24 -- ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 511 పాయింట్లు పడి 81,897 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు పతనమై 24,972 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 193 పాయింట్లు పడి 56,059 వద్దకు చేరింది.

సోమవారం అర్థరాత్రి మధ్యప్రాచ్యంలో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య కాల్పుల విరమణ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. ఈ ప్రకటనతో ముడి చమురు అతి భారీగా పతనమైంది. ఫలితంగా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు ర్యాలీ అవుతున్నాయి.

అయితే, తాము ఎలాంటి కాల్పుల విరమణకు ఒప్పుకోలేదని ఇరాన్​ చెబుతోంది. కానీ ఇజ్రాయెల్​ తమ మీద దాడి చేయకపోతే, తాము కూడా ఏం చేయమని స్పష్టం చేసింది. ఈ మాటలు ఉద్రిక్తతలు త...