Telangana, ఆగస్టు 19 -- ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2025 సెషన్ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తుల గడువు ఇటీవలే ముగియగా.. అధికారులు ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగించారు. సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రం గడువు పొడిగించలేదని స్పష్టం చేశారు.

అర్హులైన అభ్యర్థులు www.ignou.ac.in, www.ignouadmission వెబ్​సైట్ల ​ద్వారా ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోనూ సంబంధింత ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు వారిని సంప్రదించవచ్చు. లేదా ఆన్‌లైన్‌లోనే నేరుగా చేసుకోవచ్చు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స...