Telangana,hyderabad, జూన్ 12 -- తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో. భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఏసీబీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ఏసీబీ విడుదల చేసిన ప్రకటన వివరాల ప్రకారం.. నూనె శ్రీధర్ కు చెందిన మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఆయన నివాసమే కాకుండా బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. తెల్లాపూర్ లో విల్లా, షేక్ పేట లో ప్లాట్, కరీంనగర్ లో మూడు ఓపెన్ ప్లాట్లు, అమీర్ పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లలో మూడు ఇండిపెండెంట్ హౌస్ లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది.

రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వ ఉన్...