భారతదేశం, డిసెంబర్ 11 -- తెలంగాణ పాఠశాల విద్యలో అతిపెద్ద మార్పులు రానున్నాయి. ఇప్పటిదాకా పదో తరగతి వరకు ఉన్న ఎస్ఎస్‌సీ బోర్డు, ఇంటర్ వరకు ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు రెండు కలిసి పోనున్నాయి. ఈ మేరకు 1 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047లో ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ బోర్డులను ఒకే అధికారంతో భర్తీ చేయడం ద్వారా తెలంగాణ తన పాఠశాల విద్యా వ్యవస్థను పునర్నిర్మించనుంది. కొత్త బోర్డు అన్ని వర్గాల పాఠశాలలకు విద్యా ప్రమాణాలు, నాణ్యతా నిబంధనలు, గుర్తింపును నిర్వహిస్తుందని ప్రభుత్వం తెలిపింది. డ్యూయల్-బోర్డు వ్యవస్థ నుండి వైదొలగాలని కేంద్రం రాష్ట్రాలకు చెబుతోంది.

ప్రాథమిక, యూపీఎస్, ఉన్నత పాఠశాలలు వంటి ఒకే ప్రాంతంలో ...