భారతదేశం, జూలై 13 -- విలన్ గా భయపెట్టి.. కామెడీ ఆర్టిస్ట్ గా నవ్వించి.. ఓ తండ్రిగా దారి చూపి.. ఓ బాధ్యత కలిగిన వ్యక్తిగా మనసు లోతుల్లో నిలిచిపోయిన కోట శ్రీనివాస రావు ఇక లేరు. ఆదివారం (జూలై 13) తెల్లవారుజామున మరణించిన కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు తాజాగా ముగిశాయి. 750కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన నటనతో అలరించిన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాస్ రావు మరణ వార్తను సెలబ్రిటీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

83 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు కోట శ్రీనివాస రావు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో కోట మరణించారు. సాయంత్రం సుమారు 4.30 గంటలకు కోట శ్రీనివాస్ రావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్ నగర్ నుంచి మహా ప్రస్థానం వరకూ అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం పెద్ద మనవడు శ్రీనివాస్ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహ...