Andhrapradesh, జూలై 6 -- ఏపీ రెవెన్యూ వ్యవస్థలో మరో మార్పు రానుంది. వారసత్వ భూముల విషయంలో ఉన్న ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేసింది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు దారితీస్తున్నాయనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. అతి ఫీజుతోనే వారసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని నిర్ణయించింది.

ఇటీవలే సీఎం చంద్రబాబు రెవెన్యూశాఖపై సమీక్షించారు. ఇందులో పలు అంశాలపై చర్చించగా.. వారసత్వ భూములకు సెక్షన్‌ (సక్సెషన్) సర్టిఫికెట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలను అక్టోబరు 2లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే వారసత్వ భూములకు ఇచ్చే సెక్షన్ సర్టిఫికెట్ ధరలు కూడా తక్కువగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....