Telangana,hyderabad, జూలై 2 -- డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో మీ-సేవా కేంద్రాల ద్వారా వివాహ రిజిస్ట్రేషన్‌తో పాటు భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జూన్ 30వ తేదీ నుంచే ఈ 2 కొత్త సేవల కోసం స్లాట్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గతంలో మ్యారేజీ సర్టిఫికెట్ ను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్దకు వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ సమస్య లేకుండా నేరుగా మీసేవా ద్వారానే అప్లయ్ చేసుకోవచ్చు.

తాజా సేవల్లో భాగంగా.. మ్యారేజ్ సర్టిఫికేట్ పొందడానికి రూ. 200 రుసుముతో మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వధూ వరుల మ్యారేజీ ఫోటోలు, ఆధార్ కార్డులు, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ముగ్గురు సాక్షుల ఆధార్ వివరాలు తప్...