భారతదేశం, జనవరి 27 -- అరిజీత్ సింగ్ తెలుసు కదా? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని గొప్ప సింగర్స్ లో ఒకడిగా పేరుగాంచాడు. తన అద్భుతమైన గొంతుతో ఎన్నో ప్రేమ పాటలకు ప్రాణం పోశాడు. అయితే అతడు ప్లేబ్యాక్ సింగింగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అతడు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు.

అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ సింగర్ అరిజీత్ సింగ్ ఒక నోట్ రాసుకొచ్చాడు. "హలో.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నాళ్లు నన్ను ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఇకపై ప్లేబ్యాక్ వోకలిస్ట్‌గా (నేపథ్య గాయకుడిగా) ఎలాంటి కొత్త అసైన్‌మెంట్‌లు తీసుకోవడం లేదని సంతోషంగా ప్రకటిస్తున్నాను. నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం" అని అతడు అన్నాడు.

అంతకుముందు తన ప్రైవేట్ ఎక్స...