భారతదేశం, జనవరి 21 -- రాష్ట్రంలో త్వరలో మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోసం ఇంఛార్జులను నియమించింది. ఈ మేరకు జాతీయ నాయకత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా మహారాష్ట్ర మంత్రి ఆశిష్‌ షెలార్‌, సహ ఇన్‌ఛార్జ్‌లుగా రాజస్థాన్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌ పర్నామి, రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మలను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

ఇటీవలే జరిగిన ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ. ఇక తెలంగాణలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ముందస్తుగానే ఇంఛార్జులను నియమించింది. రాష్ట్ర నాయకత్వానికి కీలక సూచనలు చేయటంతో పాటు మెజార్టీ సీట్లలో పాగా వేయటమే లక్ష్యంగా దిశా...