భారతదేశం, మే 22 -- ఏపీలో జూన్‌ 1 నుంచి ఇంటింటి రేషన్‌ పంపిణీ నిలిచిపోనుంది. వైసీపీ ప్రభుత్వ హయంలో మొబైల్ డెలివరీ యూనిట్‌లతో గ్రామాలు, వార్డుల్లో రేషన్‌ దుకాణాల వారీగా రేషన్‌ పంపిణీ చేసే విధానానికి స్వస్తి పలికారు. ఇటీవల క్యాబినెట్‌లో ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేశారు.

రేషన్‌ డోర్‌ డెలివరీ పేరుతో రేషన్‌ దుకాణాల పరిధిలోని కూడళ్లలో రేషన్‌ పంపిణీ జరిగేది. ప్రతి రేషన్ దుకాణం పరిధిలో నిర్దేశియ పాయింట్‌లో రేషన్‌ బళ్ల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసేవారు. గతంలో రేషన్ దుకాణాల్లో కార్డుదారులే వెళ్లి సరుకులు తెచ్చుకునే వారు.

వాహనాలతో రేషన్‌ పంపిణీతో బియ్యం పక్క దారి పడుతోందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వాటిని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును వైసీపీ తప్పు పడుతోంది.

జూన్‌ 1 నుంచి రేషన్‌ దుకాణాల్లోనే నిత్యావసర ...