భారతదేశం, నవంబర్ 10 -- స్వామిత్వ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ప్రత్యేక గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ కంఠాల్లో ఆస్తులకు యాజమాన్య హక్కులను కల్పించనున్నారు. ఈ మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తుల వివరాలను సరిగా చేసి.. వాటిపై హక్కులను సంబంధిత వ్యక్తులకు కల్పిస్తున్నారు. స్వామిత్వ పథకం రెండో విడతలో భాగంగా 45 లక్షల ప్రాపర్టీ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లోని ఆస్తులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు ఇవ్వడం. ప్రాపర్టీ కార్డులు గ్రామాల్లోని ఇళ్లు, స్థలాలకు సంబంధించిన అధికారిక పత్రాలుగా ఉంటాయి. వీటితో ఆస్తి ఎవరిదో స్పష్టంగా తెలుస్తుంది. వివాదాలు కూడా తగ్గుతాయి. ఆస్తి హక్కు కోసం చూస్తున్న గ్రామీణులకు దీనితో మేలు జరుగుతుంది. ఆబడి, అనాధ...