భారతదేశం, డిసెంబర్ 29 -- ఈ సారి అభిమానుల అత్యుత్సాహానికి తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఇబ్బంది పడ్డాడు. చెన్నై ఎయిర్ పోర్టులో ఎగబడ్డ ఫ్యాన్స్ ధాటికి అతను కిందపడిపోయాడు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. విజయ్ తన రాజకీయ జీవితంపై దృష్టి పెట్టే ముందు జన నాయగన్ తన చివరి చిత్రం అని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తమిళ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా 'జన నాయగన్'. తెలుగులో ఇది 'జన నాయకుడు' పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో లాంఛ్ మలేషియాలో జరిగింది. ఈ గ్రాండ్ ఆడియో లాంచ్ కు హాజరైన విజయ్ ఆదివారం (డిసెంబర్ 29) రాత్రి చెన్నైకి తిరిగి వచ్చాడు. అయితే విమానాశ్రయంలో అభిమానులు ఎగబడటంతో కింద పడిపోయాడు.

విజయ్ చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అక్కడ అతని కోసం వందలాది మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. విజయ్ రాగానే ఒక్కసారిగా పైకి ఎగబడిపోయార...