Telangana,husnabad, జూలై 17 -- ప్లాస్టిక్... ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఆహార పదార్థాలు, పానీయాలను ప్యాక్‌ చేయటం దగ్గరి నుంచి ప్రతి వస్తువు తయారీలోనూ దీన్ని వాడుతున్నారు. ఓవైపు ప్లాస్టిక్ తో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ. పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రావటం లేదు. ముఖ్యంగా ఫంక్షన్ల వేళ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తెగ వాడేస్తున్నారు. తద్వారా ఆరోగ్యానికి కాదు. పర్యావరణ సమస్యలు కూడా రెట్టింపువుతున్నాయి.

రోజురోజూ ప్లాస్టిక్‌ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో.. పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టీల్ సామాగ్రి వాడకం తప్పని సరి చేసేలా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా హుస్నాబాద్ నియోజవర్గ పరిధిలోని 276 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక...