భారతదేశం, డిసెంబర్ 11 -- వందే భారత్ ట్రైన్ సర్వీసులపై గోదావరి జిల్లాల ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఇకపై నరసాపురం వరకూ ప్రయాణించనుంది. అయితే ఈ సర్వీస్ ప్రారంభ తేదీలపై రైల్వే శాఖ తాజాగా ప్రకటన చేసింది.

ఈ నెల 15వ తేదీ నుంచి నరసాపురం వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నై లో 5.30 గంటలకు బయలుదేరి ( ట్రైన్ నెంబర్ - 20677) రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్లో ఆగుతుంది. విజయవాడలో 11.45 గంటలకు, మధ్యాహ్నం 12:34 గంటలకు గుడివాడ, 1:29 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని మధ్యాహ్నం 2:10 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలోరైలు (ట్రైన్ నెంబర్ 20678) నర్సాపురం నుంచి మధ్యాహ్...