భారతదేశం, ఆగస్టు 20 -- ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కఠిన చట్టాన్ని తీసుకువస్తుంది. దీని ప్రకారం సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరూ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయలేరు. ఆన్‌లైన్ మనీ గేమింగ్ అందించే ప్లాట్‌ఫామ్‌లపై కేంద్రం నిషేధం విధించనుంది. ఆన్‌లైన్ గేమింగ్‌ను సురక్షితంగా, బాధ్యతాయుతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. చాలా కంపెనీలు ఆన్‌లైన్ గేమింగ్‌ ముసుగులో బెట్టింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం రెగ్యులేషన్, ప్రమోషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.

కొత్తగా వచ్చే చట్టం గేమింగ్ కంపెనీలతో పాటు యాప్‌లను తయారు చేసే కంపెనీలనే కాకుండా వాటిని ప్రమోట్ చేసే సెలబ్రిటీలు కూడా చట్టం పరిధిలోకి వస్తారు. బెట్టింగ్, జూద...