భారతదేశం, డిసెంబర్ 2 -- భారతదేశంలో విక్రయాల కోసం తయారు చేసే లేదా దిగుమతి చేసుకునే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌లలో "సంచార్‌ సాథీ" యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) ఆదేశాలు జారీ చేసింది. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్‌లు (ఓఈఎంలు - అంటే మొబైల్ తయారీదారులు), దిగుమతిదారులకు ఈ ఆదేశం జారీ అయ్యాయి.

మొదటిసారిగా మొబైల్‌ను ఉపయోగించేటప్పుడు లేదా డివైస్ సెటప్ చేసే సమయంలోనే ఈ యాప్ వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా, సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని, అలాగే దాని ఫీచర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయడం లేదా పరిమితం చేయడం చేయవద్దని తయారీదారులకు టెలికాం శాఖ స్పష్టం చేసింది.

మే 2023లో ప్రారంభమైన ఈ సంచార్​ సాథీ పోర్టల్ ద్వారా, పోయిన లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్‌లను రిపోర్ట్ చేయవచ్చు, వాటిని బ్లాక్...