భారతదేశం, ఫిబ్రవరి 9 -- అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం అమ్మగారిపల్లి, పుత్తవారిపల్లి గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు పశుసంవర్థక శాఖ నిర్ధారించింది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కొన్ని ప్రాంతాలలో కోళ్లు మరణించినట్లుగా తెలుస్తోంది. దీనితో పశుసంవర్ధక శాఖ భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పరీక్షల కోసం నమూనాలను పంపింది.

అన్నమయ్య జిల్లాలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కేసులు నిర్ధారించారు. శనివారం దాదాపు 40, ఆదివారం దాదాపు 50 నాటుకోళ్లు చనిపోయాయని అధికారులు తెలిపారు. పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లెలో చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టుగా గుర్తించారు.

'అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం అమ్మగారిపల్లి, పుత్తవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన బర్డ్ ఫ్లూ కేసులను అరికట్టడానికి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంద...