భారతదేశం, నవంబర్ 12 -- అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మూడు లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చవల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టపోయామని చెప్పారు.

ఇల్లు అంటే భవిష్యత్తుకు భద్రతా అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు మూడు లక్షల ఇళ్లను అప్పగిస్తున్నట్టుగా వెల్లడించారు. ఉగాది నాటికి మిగిలినవి పూర్తి చేసి అప్పగిస్తామన్నారు. ఉగాది నాటికి 5.9 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు చేయిస్తామని చెప్పారు.

'ఇళ్ల మీద సోలార్ పెట్ట...