Telangana, జూన్ 1 -- రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం. స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే 47 చోట్ల విజ‌య‌వంతంగా అమ‌లు కావటంతో... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనుంది. రేపట్నుంచే(జూన్ 2) ఈ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఈ సరికొత్త విధానంపై ఇవాళ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువ‌స్తున్న నేప‌ధ్యంలో ఎలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు రాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులకు సూచించారు.

స్లాట్ బుకింగ్ విధానంతో స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయని మంత్రి పొంగులేటి చెప్పారు. పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేసిన చోట్ల. ఆస్తుల క్ర‌య విక్ర‌య‌దారుల‌కు స‌మ‌యం ఆదా అయిందని. పార...