భారతదేశం, డిసెంబర్ 4 -- హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరుతో సమంత వివాహం డిసెంబర్ 1న జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన రెండో పెళ్లికి సంబంధించిన ఫొటోలను, అనుభూతులను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది సమంత.

తాజాగా సమంత ఒక చమత్కారమైన వ్యాఖ్యతో ఇన్‌స్టా స్టోరీ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసిన సమంత దానికి సార్కాస్టిక్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఆ ఫొటోలో రాజ్ నిడిమోరును సమంత నవ్వుతూ చూస్తూ ఉంది. చేతిలో పూలదండ పట్టుకుని నవ్వుతూ సమంత కనిపించింది.

"ఇకనుంచి మీరు అతని సమస్య అని మీరు భావించినప్పుడు" అంటూ రాసుకొచ్చిన సమంత పర్పుల్ కలర్‌లో ఉన్న డెవిల్ (రాక్షసి) ఎమోజీని యాడ్ చేసింది. అంటే, ఇకనుంచి ...