Adilabad,telangana, ఏప్రిల్ 20 -- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఇందుకోసం అమరవీరుల స్థూపం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటికే స్మృతివనం ఏర్పాటుకు రూ.95లక్షలు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జల్, జంగిల్, జమీన్ కోసం అడవి బిడ్డలు శాంతియుత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ పరిస్థితులు అదుపుతప్పటంతో ఓ పోలీసుపై ఆదివాసీ మహిళ దాడి చేయడంతో ఆయన నేలకొరిగారు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వందలాది మంది ఆదివాసీ బిడ్డలు అమరులయ్యారని స్థానికులు చెబుతారు. ఆ తర్వాత ఇక్కడ ఓ స్థూపాన్ని కూడా నిర్మించారు. అయితే ఇక్కడ నివాళులు అర్పించక...