భారతదేశం, మే 3 -- విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై ఆంక్షలు విధించినట్లు దేవస్థానం అధికారులు ఓ ప్రకటన తెలిపారు. ఈ నెల 6, 7, 8న దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరమ్మతుల దృష్ట్యా ఘాట్‌రోడ్డు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

భక్తులు కనకదుర్గానగర్‌ మార్గం నుంచి వెళ్లాలని అధికారులు సూచించారు. పున్నమిఘాట్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

విశాఖ, చెన్నై పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సీతమ్మ వారి పాదాల ప్రాంతంలోని హోల్డింగ్ ఏరియాలో వాహనాలు పార్కు చేసుకుని, దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్సులో కొండకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు భక్తులకు ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించామని దుర్గగుడి ఈవో తెలిపారు.

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద కార...