భారతదేశం, మే 20 -- పోడు రైతుల కోసం.. ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో సాగుకు మార్గం సుగమం కానుంది. పోడు రైతుల్లో సాగు ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పథకం అమలు కోసం అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ప్రత్యేక కమిటీలను నియమించి.. అమలు చర్యలు చేపడుతున్నారు.

1.మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఈ పథకానికి బాధ్యులు. మండలాల్లో 9 మందితో కూడిన కమిటీ లబ్ధిదారులను గుర్తిస్తుంది.

2.ఇప్పటికే రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద పోడు పట్టాలు మంజూరయ్యాయి. వాటిల్లో బోరు వేసి సౌర విద్యుత్‌ కల్పించే బాధ్యత వీరు తీసుకుంటారు.

3.ఈనెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించనున్నారు. వారి వివరాలను వచ్చేనెల 10లోగా క్షేత్రస్థ...