భారతదేశం, నవంబర్ 19 -- ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్‌ రోడ్డులో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు.

రాష్ట్రంలో మహిళా సాధికారతలో భాగంగా ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీని ప్రారంభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నేడు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి, అర్హులైన మహిళలకు రెండు దశల్లో చీరలను పంపిణీ చేస్తామని చెప్పారు.

చీరలు నేయడానికి ఎక్కువ సమయం పడుతుందని భావించి, ఇందిరమ్మ చీరలను రెండు దశల్లో పంపిణీ చేస్త...