భారతదేశం, డిసెంబర్ 5 -- ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా. రెండో విడత ప్రారంభంపై కీలక ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్‌ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి.. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో అర్బన్‌ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని.. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించే బాధ్యత తీ...