Telangana,hyderabad, సెప్టెంబర్ 12 -- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు, లబ్ధిదారుల అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయడం కోసం. వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడం కోసం టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను ప్రారంభించింది. ఈ సేవలు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.

హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి ఈ టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను, హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఫలితంగా లబ్ధిదారులు, దరఖాస్తుదారులు. 1800 599 5991 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను సంప్రదించవచ్చు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.

అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంట...