Telangana,hyderabad, జూలై 23 -- రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీమ్ ను అమలు చేస్తున్న ప్రభుత్వం. నిర్మాణ పనుల ఆధారంగా డబ్బులను కూడా జమ చేస్తోంది. ఇసుకతో పాటు స్టీల్ ధరల విషయంలోనూ చర్యలు చేపట్టింది. ఫలితంగా లబ్ధిదారుడిపై ఆర్ధిక భారం తగ్గేలా చూస్తోంది.

తాజాగా ఈ స్కీమ్ అమలుపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఇసుక సరఫరాతో పాటు పలు అంశాలపై కీలక సూచనలు చేశారు. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మ‌ాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోందని పునురుద్ఘాటించారు.

చెల్లింపులు, ఇసుక,సిమెంట్,స్టీల్ ధ‌ర‌ల విష‌యంలో ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. అలాగే ధ‌ర‌ల నియంత్ర‌ణ కమిటీ చురుగ్గా ప‌నిచేసేలా క‌లెక్ట‌ర్లు నిత్యం ప...