భారతదేశం, జనవరి 11 -- రామగుండం కార్పొరేషన్‌లో రూ.175 కోట్ల విలువైన పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌ కూడా హాజరయ్యారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని భట్టి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిందన్నారు. ఈ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా వెల్లడించారు. స్థలం ఉన్నవారు.. ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు అందజేస్తోందని చెప్పారు. ప్రతీవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే కొద్దీ నిధులు మంజూరు చేస్తామని భట్టి విక్రమార్క అన్నార...