భారతదేశం, అక్టోబర్ 27 -- ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఆ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇళ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేసుకోవాలని కేంద్రం అనుమతి ఇచ్చిందని, అందుకే బిల్లుల విషయంలో మార్పులు తప్పనిసరి అని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అయితే బిల్లులకు సంబంధించిన షెడ్యూల్‌లో మాత్రమే మార్పులు ఉంటాయని, రూ.5లక్షలు చెల్లింపుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం చూసుకుంటే ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా ముదటి, రెండో దశ పనులు అయ్యాక.. రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. ఈ రెండు దశ చెల్లింపుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ మూడో దశలో చెల్లించే రూ.2లక్షల చెల్లింపుల్లో మార్ప...