భారతదేశం, మే 4 -- ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలు అనుకూలంగానే ఉన్నా.. ఇంటి నిర్మాణ వైశాల్యాన్ని కుదిస్తూ.. అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తొలుత 350 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా 600 చదరపు అడుగులకు మించొద్దని.. ఒకవేళ మించితే ఇంటి నిర్మాణం ప్రారంభమైనా రద్దు చేస్తామని స్పష్టం చేసింది.

అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర నిబంధనలే కారణమని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇండ్ల నిర్మాణం లేకుంటే ఆర్థిక సాయం అందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన...