Telangana, ఏప్రిల్ 23 -- ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ మాత్రం పక్కదోవ పట్టకుండా. అర్హులైన వారికే ఇళ్లను కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల గుర్తింపునకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని క్షేత్రస్థాయిలోని అధికారులకు ఆదేశాలను ఇచ్చింది.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 30 లోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతి దశలో లబ్ధిదారులకు సహకారం అందించాలన్నారు.

ఇ...