భారతదేశం, ఏప్రిల్ 29 -- ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే.. ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోంది. విడతల వారీగా నగదును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో వేస్తోంది. అయితే.. ప్రభుత్వం రూ.5 లక్షలకు తోడు.. ఇంకా కొంచెం డబ్బులు కలిపి మంచిగా ఇల్లు కట్టుకోవాలని చాలామంది అనుకున్నారు. కానీ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతుండటంతో.. లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రంలో 70 వేల 122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 2వేల 830 మంది లబ్ధిదారులు పునాదిని పూర్తి చేసుకున్నారు. సుమారు 280 మందికిపైగా 600 చదరపు అడుగులకుపైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. దీన్ని గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు రూ.లక్ష విడుదలకు నిరాకరించారు. ప్రభుత్వ నిబ...