భారతదేశం, డిసెంబర్ 27 -- ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్‌లో పిచ్‌ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతోంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో(MCG) జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కేవలం పేసర్ల హవా నడుస్తుండటం, బ్యాటర్లు నిలవలేకపోతుండటంతో భారత మాజీ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించారు. ఉపఖండంలో స్పిన్ పిచ్‌లను విమర్శించే విదేశీయులు.. ఇప్పుడు పేస్ పిచ్‌ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

యాషెస్ సిరీస్‌లో ఇది నాలుగో టెస్టు. పెర్త్ టెస్టు పిచ్‌పై ఇప్పటికే విమర్శలు రాగా.. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు పిచ్ కూడా బౌలర్లకు స్వర్గధామంగా, బ్యాటర్లకు నరకంగా మారింది. కేవలం రెండు రోజుల్లోనే ఫలితం వచ్చేలా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డే 1: మొదటి రోజే రెండు జట్లూ ఆల...