భారతదేశం, జూన్ 26 -- మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న మూవీ ఆంధ్రుల అన్న‌పూర్ణ డొక్కా సీత‌మ్మ‌. వల్లూరి రాంబాబు , మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ'. ఇటీవ‌ల మురళీ మోహన్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆయ‌న స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో..

మురళీ మోహన్ మాట్లాడుతూ .. 'డొక్కా సీతమ్మ జీవిత క‌థ‌తో సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ను పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే సైతం డొక్కా సీతమ్మ వెళ్లలేదు. 'నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?' అని డొక్కా సీతమ్మ నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది' అని అన్న...