భారతదేశం, డిసెంబర్ 17 -- 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'హోమ్‌బౌండ్' షార్ట్‌లిస్ట్ అవ్వడం ద్వారా ప్రపంచ అవార్డుల వేదికపై ఒక పెద్ద అడుగు వేసింది. ఇది భారతీయ సినిమాకు ఒక ముఖ్యమైన మైలురాయి. 'హోమ్‌బౌండ్' ఆస్కార్ 2026కి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ వార్తను ధర్మా ప్రొడక్షన్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ధృవీకరించింది.

ఆస్కార్ రేసులో జాన్వీ మూవీ

జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ బాలీవుడ్ సినిమా హోమ్‌బౌండ్. ఇది ఆస్కార్ రేసులో దూసుకెళ్తోంది. ''హోమ్‌బౌండ్ మూవీ 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయింది. ప్రపంచం నలుమూలల నుండి మాకు అందిన అద్భుతమైన ప్రేమ, మద్దతుకు మేము చాలా కృతజ్ఞులం'' అని ధర్మ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో పేర్కొంది.

షార్ట్ లిస్ట్...