భారతదేశం, ఫిబ్రవరి 18 -- టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో సమస్యలున్నా ఈ మ్యాచ్ ఆడామంటే అందుకు కారణం శ్రీలంక అధ్యక్షుడేనని మోసిన్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగానూ ఉన్న మోసిన్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చేతకానివాడి చేతికి పీసీబీ అప్పగించారని పాక్ మాజీలు రెచ్చిపోతున్నారు.

2026 టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడానికి కారణం శ్రీలంక అధ్యక్షుడు కుమార దిసానాయకే అని మోసిన్ నఖ్వీ చెప్పుకొచ్చాడు. శ్రీలంక అధ్యక్షుడి నుండి పిలుపు వచ్చిన తర్వాతే పాకిస్థాన్ నాయకత్వం ఈ మ్యాచ్ పై ఏకాభిప్రాయానికి వచ్చిందని నఖ్వీ తెలిపాడు. శ్రీలంక అధ్యక్షుడు జోక్యం చేసుకునే వరకు కూడా...